ప్రతీ ఉద్యోగి తాను పని చేసే సంస్థలో సరైన గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. రాత్రింభవళ్లు కష్టపడి పని చేస్తూ సరైన జీతం, ప్రమోషన్ కోసం తెగ ఎదురు చూస్తుంటారు. అయితే ఎంతో కష్టపడి పని చేసిన సంస్థలో ఏ ఉద్యోగికైన సరైన గుర్తింపు దక్కకపోతే ఆ సంస్థలో ఉద్యోగం మానేయడమో లేదంటే మరింత కష్టపడి పని చేసి తన ప్రతిభతో యాజమాన్యం ముందు ఉంచడమో చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ ఉద్యోగికి కష్టానికి తగిన ప్రమోషన్ రాకపోవడంతో ఆ ఉద్యోగి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. చివరికి అతను చేసిన పనికి సంస్థనే కాదు.., దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రమోషన్ రాకపోవడంతో ఆ ఉద్యోగి ఏం చేశాడు? దేశం ఉలిక్కిపడేలా ఆయన చేసిన పనేంటనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
అమెరికాలోని ష్లమ్ బెర్గర్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ కంపెనీలో ఫెంగు లూ (58) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా కష్టపడి పని చేస్తున్న ఫెంగు లూకి సరైన ఫలితం రాలేదు. దీంతో ఫెంగు లూ పని చేస్తున్న సంస్థలో ఇతనికి బాస్ అయినా మాయో(50). ఫెంగు లూ అనేక సార్లు మాయోను కలిసి తన ప్రమోషన్ గురించి మొర పెట్టుకున్నాడు. సరేనంటూ బాస్ అలా కాలాన్ని వెల్లదీస్తూ వచ్చాడు. బాస్ ప్రమోషన్ ఇస్తాడని ఫెంగు లూ ఎన్నో రోజులూ వేచి చూశాడు. అయినా ఫెంగు లూకు సరైన జీతంతో పాటు ప్రమోషన్ కూడా దక్కలేదు. ఇక విసిగిపోయిన ఆ ఉద్యోగి చేసేదేంలేక ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
పక్క ప్లాన్ తో ఫెంగు లూ మాయో కుటుంబాన్ని హత్య చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఫెంగు లూ ఓ తుపాకీని కొనుగోలు చేశాడు. ఇక ఫెంగు లూ బాస్ కుటుంబాన్ని హత్య చేసేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు కూడా రానే వచ్చింది. ముందుగా తన బాస్ అయినా మాయోను కాల్చి చంపాడు. అనంతరం మాయో భార్యను ఆ తర్వాత అతని కుమారుడు, కూతురిని గన్ తో కాల్చి చంపాడు. ఇక వారందరి శవాలని వేర్వేరు గదుల్లో ఉంచి అప్పటి నుంచి ఎవరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుడు ఫెంగు లూను పట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఫెంగు లూ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి నిందితుడు ఫెంగు లూ తన స్వదేశమైన చైనాలో తల దాచుకుంటూ ఉన్నాడు. చాలా ఏళ్లు అతని కోసం పోలీసులు అనేక చోట్ల వెతికారు. ఇక మొత్తానికి పోలీసులు నిందితుడు ఫెంగు లూ జాడను కనుగొని పోలీసులు తాజాగా ఫెంగు లూను అరెస్ట్ చేశారు. 2014 జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాస్ ప్రమోషన్ ఇవ్వలేదని అతని కుటుంబాన్నే కాల్చి చంపిన ఫెంగు లూ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Huge news! On 1-30-14, HCSO deputies responded to a residence at 14015 Fosters Creek Dr (Cypress). Deputies discovered two (2) adults, one male and one female, and two children, ages 9 and 7, deceased from gunshot wounds. On Sunday, 9-11-22, HCSO Homicide Investigators 1/3 pic.twitter.com/GLICk30rib
— Ed Gonzalez (@SheriffEd_HCSO) September 13, 2022