ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’ సినిమాకు లీకుల బాధ తప్పడం లేదు. ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదల సమయంలో ఓ వీడియో బయటకొచ్చి కేసుల వరకూ వెళ్లింది. తాజాగా మరోసారి ఈ సినిమా చిత్రీకరణ ఫుటేజ్ బయటకొచ్చింది. కాకినాడ పోర్టులో జరుగుతున్న షూటింగ్ సన్నివేశాలు మంగళవారం బయటికొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్ బయటకు రావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది. వీడియో బయటకు ఎలా వచ్చిందో అర్థంకాక యూనిట్ తలపట్టుకుంటోంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చిత్ర బృందం సిద్దమైనట్లు సమాచారం.