“పుష్ప”.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే.., పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలకి సమయం దగ్గర పడతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే “పుష్ప” మూవీ యూనిట్ “దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుకుద్ది పీక” అనే సాంగ్ ని విడుదల చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ పాట ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక జీవికి ఆకలి వేస్తే.., మరో జీవి బలి కావాల్సిందే. ఇదే తరతరలుగా వస్తున్న అడవి నీతి. ఈ థీమ్ ని పాట రూపంలో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇందులో చంద్రబోస్ రాసిన లిరిక్స్ చాలా సింపుల్ గా, అందరికీ అర్ధమయ్యే రీతిలో ఉన్నాయి. ఇక దేవి ట్యూన్ కూడా అద్భుతంగా సెట్ అవ్వడంతో “దాక్కో దాక్కో మేక” ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగింది. మొత్తం 5 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో విజువల్స్ పరంగా కూడా సినిమాకి సంబంధించిన చాలా అంశాలను రివీల్ చేశాడు దర్శకుడు సుకుమార్.
పాటలో 43 సెకండ్స్ వద్ద అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. కానీ.., మీరు బన్నీ ఎంట్రీ జాగ్రత్తగా గమించారా? అందులో బన్నీ ఎడం భుజం కాస్త ఎత్తుగా పెట్టుకుని ఉన్నాడు. అంటే.., పుష్ప మూవీలో హీరోకి లైట్ గా గూని ఉన్నట్టు అర్ధం అవుతోంది. నిజానికి సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి ఏదో ఒక డిజిబిలిటీ ఉండటం సర్వ సాధారణం. సో.., పుష్పలో ఈ గూని స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది అనమాట.
ఈ పాటలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షాట్స్ కూడా సీజిలో చూపించారు. కానీ.., మీరు గమనించారా? ఒక్క దగ్గర కూడా పోలీసులు కనిపించలేదు. సో.. టీజర్ లో చూపించినట్టు పుష్ప రాజ్ కి పోలీసులతో మాత్రమే శత్రుత్వం కాదు. అతన్ని అడ్డుకునే మరో గ్యాంగ్ కూడా ఉందని అర్ధం అవుతోంది. సో..,సినిమాలో పక్కా మాస్ మసాలా ఫైట్స్ కి కొదవ లేదు అనమాట.
ఇక పాట మొత్తంలో ఎక్కువగా కనిపించింది గంధపు చెక్కలు మాత్రమే కాదు. పుష్పరాజ్ లారీ కూడా. నెంబర్ ప్లేట్ తో సహా దర్శకుడు లారీని చాలా క్లియర్ గా చూపించాడు. అంటే.. కథాగమనంలో ఈ లారీ ప్రత్యేకంగా నిలవబోతుంది అనమాట. ఇక పాట చివరిలో కూడా “తగ్గేదే లే” అనే డైలాగ్ పెట్టడం మంచి ఫినిషింగ్ గా అనిపించింది. మరి.. “దాక్కో దాక్కో మేక” సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.