సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. పాటపై ఆయనకు ఉన్న మక్కువను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గుర్తు చేసుకొని ఎంతో ఎమోషన్ అయ్యారు. ఆయన నాకు చాలా చాలా ఇష్టమైన మాత్రమే కాదు నా కుటుంబ సభ్యుల తర్వాత ఎంతో గౌరవమైన స్థానం ఆయనకు ఉందన్నారు.
నేను కాళ్లకు నమస్కరించే కొద్ది మందిలో ఆయన ఒక్కరు అన్నారు. ఆయన పాటలు విని తెలుగు సాహిత్యంపై ఎక్కువ గౌరవం పెరిగిపోయిందని అన్నారు. అంత గొప్ప ఫీలింగ్ కలిగించిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఒక గొప్ప సినీ గేయ రచయిత.. అలాంటి వ్యక్తి మల్లీ మనకు దొరకరు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నారు. అయితే అందరూ ఆయన చనిపోయారని అంటున్నారు. నిన్న ఒక్కరోజే ఆయన చనిపోయింది.. రేపటి నుంచి ఆయన అందరి హృదయాల్లో బతికే ఉంటారని.. ఆయన పాటలు.. తెలుగు చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ జనాలు గుర్తు పెట్టుకుంటారని.. అందరి మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతార అన్నారు.