ఫిల్మ్ డెస్క్- అల్లు అర్జున్.. ఈ స్టైలిష్ స్టార్ కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అల్లు అర్జున్ కు సెలబ్రెటీలు కూడా అభిమానులంటే ఆయన స్టార్ డమ్ ను అర్ధం చేసుకోవచ్చు.
అన్నట్లు అల్లు అర్జున్ ఫ్యామిలీ మ్యాన్. అవును.. సినిమా షూటింగుల నుంచి ఏ మాత్రం సమయం దొరికినా.. కుటుంబంతో కలిసి గడిపేందుకు ఇష్టపడతాడు బన్నీ. ఇంట్లోనే పిల్లలతో సరదాగా గడపడంతో పాటు, అందరిని తీసుకుని అలా వేకేషన్ కు వెళ్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా భార్య పిల్లలతో హైదరాబాద్ రోడ్లపై కారులో షికారు కొట్టడం అల్లు అర్జున్ కు భలే సరదా.
అల్లు అర్జున్ ఏ విషయంలోనైనా లగ్జరీగా ఉండాలనుకుంటాడు. అది కారైనా, ఇళ్లైనా.. అదిరిపోవాలంతే అనుకుంటారు. మెగాస్టార్ చిరంజీవిలాగే బ్లాక్ కలర్ ను ఇష్టపడే అల్లు అర్జున్, తన వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా డిజైన్ చేయించుకున్నారు. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యాన్ ధర 7 కోట్ల రూపాయలు. ఈ వ్యాన్ ను బన్నీ ముద్దుగా ఫాల్కాన్ అని పిలుచుకోవడం విశేషం. ఈ వ్యాన్ లో భారీ టీవీ, ఫ్రిజ్‌తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ లాంటి చాలా హంగులున్నాయి.
ఇక అల్లు అర్జున్ కు కార్లంటే భలే ఇష్టం. తన గ్యారేజ్ లో తన పేవరెట్ కార్లన్నీ ఉండాల్సిందే. అందులో అత్యంత ఇష్టంగా కొనుక్కున్నలగ్జరీ కారు రేంజ్ రోవర్ వోగ్ ఒకటి. బన్నీ ఈ కారు ఫోటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఇంట్లో కొత్త కారు, నేను దానికి బీస్ట్ అని పేరు పెట్టాను, నేను ఏదైనా ప్రత్యేకమైన దానిని కొన్న ప్రతిసారి నా మనసులో ఒకటే ఉంటుంది, అది కృతజ్ఞత.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ రోవర్ కారు ఖరీదు కోటి రూపాయల వరకు ఉంటుంది.
అల్లు అర్జున్ కార్ కలెక్షన్స్ లో మరో ఖరీదైన కారు హమ్మర్ హెచ్-2. దీని ఖరీదు 1 కోటీ 50 లక్షలు ఉంటుంది. ఈ కారును అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా తన తొలి సంపాదనతో కొనుగొలు చేశాడట. ఈ కారులోనే బన్నీ ఎక్కువగా భార్య, పిల్లలతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళుతుంటాడని తెలుస్తోంది. అంతే కాదు తన గ్యారేజ్ లో రెడ్ మెర్సిడేజ్ 200 సీడీఐ ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. దీని ధర 50 లక్షల రూపాయలు పైనే ఉంటుంది.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ కొత్త ఇళ్లు గురించి. హైదరాబాద్ లోని అల్లు అర్జున్ ఇంటి పేరు ‘బ్లెస్సింగ్’. సుమారు రెండు ఎకరాల స్థలంలో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో విలాసవంతంగా ఈ ఇంటిని తన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్నాడు. తెలుపు రంగుతో పెయింటింగ్ చేసిన ఈ ఇంటి లోపల జిమ్, హోమ్ థియేటర్, స్పెషల్ పార్టీల కోసం బార్ జోన్, పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా, పెద్ద స్విమ్మింగ్ ఫూల్.. ఇలా చాలా ఉన్నాయి.