సినిమా హీరోలంటే ఫ్యాన్స్ కి చాలా అభిమానం ఉంటుంది. కానీ.., స్టార్ హీరోలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? ఏమి చేస్తుంటారు? వారి అలవాట్లు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించినది అని చెప్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చదవండి: SR కళ్యాణ మండపం మూవీ రివ్యూ
ఫేస్ బుక్ లో ఇప్పుడు చాలా పేజెస్ న్యూస్ ఫీడ్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ పేజ్ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో బన్నీ లిక్కర్ మార్ట్ లోకి ప్రవేశించి.. తనకి కావాల్సిన లిక్కర్ బాటిల్ ని కొనడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లిక్కర్ మార్ట్ గోవాలోనిదని ఆ పేజ్ నిర్వాహకులే స్పష్టం చేశారు. దీంతో.., ఇప్పుడు నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
నిజానికి ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి లుక్, ఇప్పటి అల్లు అర్జున్ లుక్ఒక్కటి కాదు.కానీ.., నా పేరు సూర్య మూవీ టైమ్ లో మాత్రం బన్నీ ఈ లుక్ లోనే ఉన్నాడు. కాబట్టి.. ఈ వీడియో కాస్త పాతదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక.. ఇక ఈ వీడియోలో ఉంది నిజంగా అల్లు అర్జునేనా? లేక ఆయనలా ఉన్న మరో వ్యక్తా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి.. ఈ వీడియో కనిపిస్తున్న వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.