శాకుంతలం సినిమా తర్వాత అల్లు అర్హ పేరు మారుమోగిపోతుంది. ఆమె క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. తాజాగా అర్హకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
సెలబ్రిటీల పిల్లలు కూడా పుట్టకతోనే అభిమానులను సంపాదించుకుంటారు. ఇక సోషల్ మీడియా వినియోగం పెరగడంతో.. సెలబ్రిటీలు అభిమానుల కోసం తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. వీటిల్లో కొన్ని విపరీతంగా వైరలవుతాయి. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో ఇలానే వైరలవుతోంది. అసలు ప్రస్తుతం ఎక్కడ చూసిన అర్హ పేరు మారుమోగిపోతుంది. శాకుంతలం సినిమాలో బాల భరతుడిగా.. అర్హ అదరగొట్టింది. స్వచ్ఛమైన తెలుగులో.. ముద్దుముద్దుగా అర్హ చెప్పిన డైలాగ్‌లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలే తెలుగులో మాట్లాడరు. ఇక వారి పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. కానీ అర్హ అందుకు భిన్నంగా చక్కగా తెలుగులో మాట్లాడటం చేసి అభిమానులు మురిసిపోతున్నారు. శాకుంతలం డిజాస్టర్ అయినప్పటికి.. అల్లు అర్హ మాత్రం ఈ సినిమాలో తన యాక్టింగ్‌తో అందరి మనసు గెలుచుకుంది. ఆరేళ్లకే తండ్రికి తగ్గ తనయ అంటూ ప్రశంసలు పొందుతుంది.
శాకుంతలం మూవీ విడుదల తర్వాత అల్లు అర్హ క్రేజ్ మరింత పెరిగింది. ఆమెను చూసేందుకు.. అల్లు అర్జున్ నివాసం దగ్గరకు అభిమానులు పోటేత్తుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తనను చూసేందుకు వచ్చిన అభిమానులను భయపెట్టింది అర్హ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అర్హను చూడటం కోసం.. కొందరు అభిమానులు అల్లు అర్జున్ నివాసం వద్దకు వెళ్లి.. గోల గోల చేశారు. వారి కేకలు విన్న అల్లు అర్హ బయటకు వచ్చింది. వాళ్ళను పలకరించేందుకు కాంపౌండ్ వాల్ వైపు నడుచుకుంటూ వస్తుండగా.. ఓ అమ్మాయి అర్హను ఆపే ప్రయత్నం చేసింది. కానీ అర్హ మాత్రం.. ఆ అమ్మాయి మాట పట్టించుకోకుండా ఫ్యాన్స్‌కు ఎదురుగా వెళ్లి.. వారి ముందు ఓ చిత్రమైన విన్యాసం చేసి.. భయపెట్టే ప్రయత్నం చేసింది. తన కంటి రెప్పలు పైకి లేపి కళ్ళను భయంకరంగా మార్చి.. అభిమానులను భయపెట్టింది అర్హ.
అది చూసి ఫ్యాన్స్ మరింతగా నినాదాలు చేస్తుంటే… పక్కన ఉన్న అమ్మాయి అర్హను ఎత్తుకుని అక్కడ నుంచి తీసుకెళ్లింది. అభిమానులు మాత్రం కేకలు వేసి.. గోల చేశారు. ఈ వీడియో చూస్తే.. చిన్నారి అర్హకు ఏమాత్రం భయం ఉండదని అర్థం అవుతుంది. ఇక దీని గురించి శాకుంతలం ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ సమంత, డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్హకు భయం లేదని, తెలుగు స్పష్టంగా మాట్లాడుతుందని ప్రశంసించారు.
శాకుంతలం మూవీతో అల్లు అర్హ టాలెంట్ అందరికి తెలిసిందే. దాంతో అర్హకు మరిన్ని అవకాశాలు వస్తాయి అంటున్నారు అభిమానులు. మరి అల్లు అర్జున్ ఆమెను ప్రోత్సహిస్తారో లేదో చూడాలి. ఇక అల్లు అర్జున్ సైతం చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ స్వాతిముత్యం చిత్రంలో అల్లు అర్జున్ చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అర్హ కూడా తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మొతటి చిత్రంతోనే తన ప్రతిభను చాటుకుంది. మరి అల్లు అర్హ మరిన్ని చిత్రాల్లో నటించాలని మీరు కోరుకుంటున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Arha 😂😂😂 @alluarjun pic.twitter.com/6Rzlyzan42
— AK. (@flawsomedamsel) April 20, 2023