స్పెషల్ డెస్క్- అలీ రెజా.. ఈ నటుడు బిగ్ బాస్ షో ద్వార బాగా పాపులర్ అయ్యారు. అంతకు ముందు కొంద మందికి మాత్రమే తెలిసిన అలీ రెజా.. బిగ్ బాస్ రియాల్టీ షో తరువాత అందరికి తెలిసిపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో అలీ రెజా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ షోలో ఓ సందర్బంగా అలీ రెజా కోసం భార్య మసూమా హౌజ్ లోకి వచ్చారు. అదిగో అప్పటి నుంచి ఆమె కూడా బాగా పాపుర్ అయ్యారు.
ఇక అలీ రెజా తన భార్య మసూమతో చేసే సరదా, సందడి ఆశామాషిగా ఉండదు. వీళ్లిద్దరు కలిసి సోషల్ మీడియాలో వెరైటీ వీడియోలను చేస్తుంటారు. యూట్యూబ్‌లోనూ అలీ రెజా, మసూమా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఏదైనా వెకేషన్స్ కు బయటకు వెళ్లిన సందర్బంలో బాగా హంగామా చేస్తుంటారు. అన్నింటినీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు అలీ రెజా.
రీసెంట్ గా రాఖీ పండగ సందర్బంగా కుటుంబం అంతా ఒకచోటుకు చేరుకుంది. లోనావాలాలోని అలీ రెజా ఇంటిదగ్గర అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఈ సందర్బంగా అలీ రెజా, ఆయన భార్య మసూమా బైక్ పై సరదాగా రైడ్ చేశారు. ఈ క్రమంలో అలీ రెజా భార్య మసూమాను ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఇంకేముంది ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అలీ రెజా కు భార్య అంటే ఎంత ప్రేమో ఈ ఫోటో చూస్తే తెలిసిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శివజ్యోతి, హిమజ, రోహిణి వంటి వారితో కలిసి మసూమ బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణ, యాంకర్ రవి వంటివారితోనూ అలీ రెజా పార్టీల్లో పాల్గొంటుంటారు.