సమంత, చైతూ విడాకులపై పలువురు సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది వీరి విడాకులపై బాధ వ్యక్తం చేస్తుంటగే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పెళ్లి అంటే చావుతో పోల్చి, విడాకులను పునర్జన్మతో పోల్చారు. తాజాగా అక్కినేని నాగార్జున సతీమణి అమల ట్విట్ లో స్పందించారు.
అయితే నిన్న ఇద్దరి విడాకుల అంశంపై నాగ్ స్పందించారు. ”ఇది ఎంతో బాధతో చెబుతున్నాను. సమంత, నాగచైతన్య విడిపోవడం చాలా దురదృష్టకరం. అయితే వారిరువురు భార్య భర్తలు. వారి మధ్య లో ఏం జరిగింది అనేది వారి వ్యక్తిగత విషయం. కానీ ఏదేమైనా వారిద్దరూ నాకు ఎంతో ఇష్టం. సమంతతో మా కుటుంబం చాలా మధురమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకుంది. అయితే ఈ కష్ట సమయంలో వారిరువురికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను” అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు నాగర్జున.
ఈ పోస్ట్ పై అమల అక్కినేని ఓ నమస్కారం బొమ్మ పెడుతూ రీ పోస్ట్ చేశారు. మొత్తానికి అక్కినేని కుటుంబంలో నిన్నటి రోజు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని.. ఎంతో ప్రేమానురాగాలతో ఉన్న జంట ఒక్కసారే విడిపోవడంపై ఫ్యాన్స్ కూడా ఆవేదన చెందుతున్న విషయం తెలిసిందే.
— Amala Akkineni (@amalaakkineni1) October 2, 2021