నేషనల్ క్రైం- బావా, మరదలు అంటే సరదాలు, ఆట పట్టింపులు, చిలిపిచేష్టలు మామూలే. మరదలితో బావ.. బావతో మరదలు ప్రేమగా ఉండటం మామూలే. ఐతే ఓ దుష్టుడైన బావ మాత్రం తన మరదలి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తన మరదలిని మానసికంగా వేధించుకు తిన్నాడా ప్రబుధ్దుడు.
ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. జుహరపురకు చెందిన ఓ యువతికి 2020 ఆగష్టులో పెళ్లైంది. ఐతే కుటుంబ కలహాల కారణంగా తన బావను తన పెళ్లికి పిలవలేదు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు బావ, పెళ్లైన మరదలిని వేధించడం మొదలుపెట్టాడు. మొబైల్‌లో నగ్న చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
తన బావ వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన కోరిక తీర్చాలంటూ తరుచూ వేధింపులకు గురిచేస్తూ, ఫోన్‌లో నగ్నచిత్రాలు, అశ్లీల మెసేజ్‌లు పంపుతున్నాడు. తన కోరిక తీర్చలేదంటే మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన సందేశాలను ఆమె భర్తకు పంపుతానని బెదిరిస్తూ వస్తున్నాడు.
బావ చేసే పని బయటపడితే.. తన కుటుంబ పరువుపోతుందని, తన భర్తకు ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడనే భయంతో బావ వేధింపులను ఇన్నాళ్లూ ఆమె భరిస్తూవచ్చింది. ఐతే రోజురోజుకు బావ వేధింపులు పెరగటంతో విసిగిపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బావను అరెస్ట్ చేశారు.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.