1995లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన అగ్రిగోల్డ్ సంస్థ కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరుతో ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. అతి తక్కువ సమయంలోనే కొన్ని వేల కోట్ల డిపాజిట్లు వీరి ఖాతాలో జమ అయ్యాయి. మొత్తం 7 రాష్ట్రాలలో ప్రజలు వీరిని అంతలా నమ్మారు. కట్ చేస్తే.. అగ్రిగోల్డ్ యజమానులు ఆ డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి.., అక్కడ నష్టాలు రావడంతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టేశారు. అప్పటి నుండి తమకి న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ.., ఏ నాయకుడు వీరి గోడును పట్టించుకోలేదు. కానీ.., ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రం అగ్రిగోల్డ్ బాధితుల కష్టాన్ని తీర్చాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగానే.. వైసీపీ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పొందపరిచారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఇప్పుడు 7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలో వైసీపీ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు వారికి రూ. 459.23 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. ఇది అగ్రిగోల్డ్ బాధితులకి రెండో దశ పరిహారం. 2019లోనే జగన్ ప్రభుత్వం మొదటి దశ పరిహారాన్ని అందించింది. రానున్న కాలంలో లక్ష వరకు ఇన్వెస్ట్ చేసిన బాధితులకి కూడా పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అగ్రిగోల్డ్ ఆస్తల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధం కానుంది. ఏదేమైనా.. ఒక ప్రైవేట్ సంస్థ చేసిన మోసానికి, ప్రభుత్వం జబాబుదారీతనం తీసుకుని, ఇంత మంది ప్రజలకి న్యాయం చేయడం మాత్రం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. మరి.. ఈ విషయంలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.