చెత్త ఫీల్డింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాకిస్థాన్ ప్లేయర్లు.. లంకతో మ్యాచ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించారు. తొలి ఇన్నింగ్స్‌లో సమరవిక్రమ కొట్టిన బంతిని పాక్ ఫీల్డర్ అమాంతం గాల్లోకి ఎగిరి పక్షిలా అందుకున్నాడిలా!
పాకిస్థాన్ జట్టుఎందరో గొప్ప బౌలర్లను ప్రపంచానికి ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ నుంచి మొదలు పెట్టుకొని వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్ ఇలా ఎందరో పాక్ బౌలర్లు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సోహైల్ తన్వీర్, ఉమర్ గుల్, మహమ్మద్ అమీర్ కూడా తమ స్థాయిలో ఫర్వాలేదనిపించారు. తాజాగా షాహీన్ సా అఫ్రిది, నసీమ్ షా కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇక బ్యాటింగ్‌లోనూ అప్పటి జావేద్ మియాందాద్ నుంచి.. ఇప్పటి బాబర్ ఆజమ్ వరకు ఎందరో గొప్ప ప్లేయర్లు వచ్చారు. కానీ.. ఆ జట్టు ఫీల్డింగ్ మాత్రం ఏ దశలోనూ ప్రపంచ స్థాయిలో కనిపించిన దాఖలాలు లేవు. ఇతర దేశాలన్నీ ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచుకుంటూ.. ఫీల్డింగ్‌పై కూడా ప్రధాన దృష్టి పెడుతున్నా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పొచ్చు. మరి అలాంటి పాక్ క్రికెటర్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడంటే నమ్మగలమా! నమ్మక తప్పదు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ ప్లేయర్ ఇమాముల్ హక్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.
లంక తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆదివారం మొదటి రోజు మూడో సెషన్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఆఘా సల్మాన్ వేసిన బంతిని వికెట్ కీపర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. అనూహ్య బౌన్స్ అయిన బంతి.. షార్ట్ లెగ్‌లో పైకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఇమామ్ తన కుడివైపునకు దూకుతూ అమాంతం బాల్‌ను ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్‌కు పాక్ ప్లేయర్లంతా మంత్రముగ్దులయ్యారు. సాధారణంగా పాక్ జట్టులో ఇలాంటి దృశ్యాలు అరుదు కావడంతో.. సహచరులంతా ఇమామ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. వర్షం కారణంగా ఆగి ఆగి సాగుతున్న మ్యాచ్‌లో ఈ వికెట్‌తోనే అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపివేశారు.
ఇమామ్ సూపర్ క్యాచ్‌కు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. పక్క నుంచి బంతి పోతున్నా ఆపే ప్రయత్నం చేయని.. పాకిస్థాన్ ఆటగాడేనా ఈ క్యాచ్ అందుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సులువైన క్యాచ్‌లను కూడా.. క్లిష్ట తరంగా మార్చి లడ్డులా చేతిలోకి వచ్చిన బంతిని సైతం నాలుగుసార్లు తడబడి కానీ అందుకోలేని పాక్ క్రికెటర్లు.. పక్షిలా దూకుతూ జాంటీ రోట్స్‌ను తలపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పాక్ ఫీల్డర్ సూపర్ ఫీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.