ఫిల్మ్ డెస్క్- ఆదిపురుష్.. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ సినిమా విడుదల కాకుండానే రికార్డుల బద్దలు కొడుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ మూవీగా ఇప్పటి వరకు బాహుబలి 2 నిలవగా.. ఇప్పుడు దాన్ని మించిపోతోంది ఆదిపురుష్. బాహుబలి 2 కోసం దర్శక ధీరుడు రాజమౌళి మొత్తం 2500 లకు పైగా వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను షూట్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియాలో మరే సినిమాకు ఈ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ షాట్స్ ను వాడలేదు. బాహుబలి 2 ను మించిన సినిమా ఆదిపురుష్ అంటూ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.
బాహుబలి 2 సినిమా కంటే ఏకంగా మూడు రెట్లు అదనంగా ఆదిపురుష్ లో వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంటూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ట్వీట్ చేసింది. ఆదిపురుష్ సినిమా కనీవినీ ఎరుగని విజువల్ వండర్ గా రోబోతోందట. సినిమా లో దాదాపుగా 90 శాతం వరకు వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ట్వీట్ ప్రకారం ఆదిపురష్ సినిమా లో ఏకంగా 8000 లకు కాస్త అటు ఇటుగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయట. అంటే ఇది బాహుబలి 2 కు ఏకంగా మూడు రెట్లు అదనం. ఈ సినిమాలో మోషన్ గ్రాఫిక్స్ ను కూడా ఓమ్ రౌత్ చూపించబోతున్నాడు.
బాహుబలి 2 ఇప్పటి వరకు ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ సినిమా అని చెప్పవచ్చు. సాంకేతికపరంగానే కాదు, వసూళ్ల విషయంలో కూడా బాహుబలి 2 ను మించిన సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో ఆదిపురుష్ బాహుబలిని క్రాష్ చేస్తోంది. మరి వసూళ్ల విషయంలో బాహుబలి 2 ను ఆదిపురుష్ బ్రేక్ చేస్తుందా లేదా అన్నది మాత్రం ముందు ముందు తేలనుంది. ఆదిపురుష్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా కనిపించబోతున్నారని, అభిమానులకు పంండగనే అని చెబుతున్నారు మేకర్స్.
8000 VFX Shots for #Adipurush with 3 different colours visual sets. That’s more than 3 times of #Bahubali2 which had 2500 Shots on 2 colours visual set. This is HUGE! #Prabhas
— Indian Box Office (@box_oficeIndian) June 15, 2021