ముంబయి- ఫ్యాషన్.. ప్రపంచమంతా ఇప్పుడు దీనివెనుకే పరిగెడుతోంది. అలా అని ఫ్యాషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి రోజు.. ఒక్కోసారి ప్రతి గంటకు ఫ్యాషన్ మారిపోతుంది. మరి ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ను అందిపుచ్చుకోవడంలో అందరికంటే ముందుండే వాళ్లు సినీమా వాళ్లే కదా. అందుకే సినీ సెలబ్రెటీలు ఫ్యాషన్ కు మారుపేరుగా, ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటుంటారు.
ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నామంటే.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో బాలీవుడ్ భామ ఉర్వి జావెద్ డ్రస్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇదేం కొత్త ఫ్యాషన్ రా బాబు అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఉర్వి జావెద్ బాలీవుడ్ టెలివిజన్ రంగానికి చెందిన నటి. ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ లో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఉర్రూతలూగిస్తూ ఉంటుంది.
ఇక ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఉర్వి జావెద్ కాస్త ఎబ్బెట్టుగా ఉన్న డ్రస్ తో కనిపించింది. తన డెనిమ్ షర్ట్ ను కట్ చేసుకుని, ఇన్నర్ కనిపించేలా ఎక్స్పోజ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఆమె షర్ట్ వెనుక ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అనే మెసేజ్ కూడా ఉంది. ఇంకేముంది ఉర్వి జావెద్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉర్వి డ్రెస్ పై నెటిజనెస్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. ఫ్యాషన్ ను మెయింటైన్ చేయడంలో తప్పులేదు కానీ.. ఇంత దిగజారిపోయి, దుస్తులను చింపుకొని మరీ హాట్ హాట్ ఫోజులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఉర్వి పై ఫైర్ అవుతున్నారు. మరి నెటిజన్స్ కామెంట్స్ పై ఉర్వి ఎలా స్పందిస్తుందో. మీరు కూడా ఉర్వి జావెద్ కు సంబందించిన ఫోటోలను ఓ సారి చూడండి.