40 ఏళ్లులోనూ తరగని అందంతో, సినిమాలు చేస్తున్నారు తారామణులు. అటువంటి వారిలో ఒకరు నటి త్రిష. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ బ్యూటీ అయిన త్రిష మగవాళ్ల పట్ల తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇంతకు ఆమె ఏమన్నారంటే..?
దేశంలో ఏ సినీ ఇండస్ట్రీలో అయిన హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు స్క్రీన్ పై కనిపించే వ్యవధి కాదూ.. సినిమాల్లో నటించే కాల వ్యవధి తక్కువగా ఉంటుంది. ఉన్న ఆ కొంత సమయంలోనే అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందాన్ని కాపాడుకుంటూ ఆత్మ విశ్వాసంతో దూసుకెళ్లాలి. గతంలో 30 దాటినా, పెళ్లై, పిల్లలు ఉన్నారంటే.. ఇక వారు ఫెయిడ్ అవుడ్ అయినట్లే. కానీ నేడు ట్రెండ్ మారింది. ముప్పై కాదూ 40 ఏళ్లులోనూ తరగని అందంతో, సినిమాలు చేస్తున్నారు తారామణులు. అటువంటి వారిలో ఒకరు నటి త్రిష. చాన్నాళ్లుగా వెండితెరపై వెలుగులీనుతోంది. ఒకనొక దశలో అవకాశాలు రాకపోయినా.. ఫెయిల్యూర్ ఎదురైనా వెనకడుగు వేయకుండా.. సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టింది. తాజాగా పొన్నిసెల్వయన్‌లో కుందవై క్యారెక్టర్‌లో కట్టిపడేసింది.
అయితే గురువారం తన 40వ పుట్టిన రోజు జరుపుకున్న త్రిష..మగవాళ్లనుద్దేశించి ఓ హాట్ కామెంట్ చేసింది. పురుషుల గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘మామూలుగా ఆడవారిని అర్థం చేసుకోవడం కష్టమని అందరూ అంటుంటారు కానీ.. నిజానికి మగవారిని అర్థమే చేసుకోలేం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరో విధంగా ప్రవర్తిస్తారు. నాకు మగ స్నేహితులు ఉన్నారు. అయితే వారి మనస్సులను గాయపరచాలని నేను ఇదంతా చెప్పడం లేదు. ఒకరోజు మగవాడిగా పుట్టాలన్నది తన గట్టి కోరిక. ఇదే విషయాన్ని అమ్మకు కూడా చెప్పా’అని అన్నారు. దీనికి కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని ఒక మగవారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలుసుకోవాలనే కుతూహలమే తన ఉద్దేశమన్నారు.
కాలేజీ చదువుతున్న రోజుల్లోనే వాణిజ్య ప్రకటనల్లో నటించింది త్రిష. అందాల పోటీల్లో పాల్గొని మిస్ చైన్నె కిరీటాన్నీ గెలుచుకుంది. సినిమాల్లోకి రావాలని లేకున్నా యాదృచ్ఛికంగా వచ్చేసింది. జోడీ సినిమాలో సిమ్రాన్‌కు స్నేహితురాలుగా చిన్న పాత్రలో కనిపించింది. లేసా లేసా అనే చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తమిళం, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరింది. ఇప్పుడు కన్నడ పరిశ్రమలోనూ పలు సినిమాలు చేసింది. హిందీలో ఒక సినిమా చేసినప్పటికీ.. అంత ఫేమ్ రాలేదు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలతో మరోసారి హిందీ పరిశ్రమను ఏలేందుకు సిద్ధమైంది ఈ అమ్మడు.