ఫిల్మ్ డెస్క్- ప్రగతి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో వదిన, తల్లి, అత్త పాత్రల్లో నటించింది ప్రగతి. అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ప్రగతికి మంచి క్రేజ్ ఉంది.
ఇక ప్రగతి ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే బిజీగా ఉంది. అందులోను జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను ప్రగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు స్టెప్పులు కూడా వేస్తుంటుంది. పాపులర్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసిన వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంటుంది ప్రగతి.
ఇదిగో ఇప్పుడు పుష్ప సినిమాలోని మాస్ సాంగ్ ఊ అంటావా మావ కు ప్రగతి డ్యాన్స్ చేసింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అనే పాటను పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ ఎంతగా వైరల్ అయిందో తెలుసు కదా. జిమ్ లో వర్కవుట్స్ చేశాక ఈ పాటపై డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. చాలా ఈజీగా ఈ సాంగ్ కు స్టెప్పులేసింది ప్రగతి.
పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ.. పాటపై లెక్కలేనన్ని కవర్ సాంగ్స్ వచ్చాయి. అషూ రెడ్డి సైతం ఎంతో ఖర్చు పెట్టి ఈ పాటపై డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ప్రగతి కూడా ఊ అంటావా మావ సాంగ్ కు కాలుకదిపి అందరిని ఆకట్టుకుంది.