ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ గుర్తుంది కదా.. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లోి ఎంట్రీ ఇస్తోంది పాయల్. కన్నడలో తన డెబ్యూ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తెలుగులో కిరాతక అనే సినిమాలో నటిస్తోంది.
సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ తో జంటగా నటిస్తోంది పాయల్ రాజ్ పుత్. ఇక కిరాతక మూవీ నుంచి వచ్చిన రొమాంటిక్ పోస్టర్లు బైగా వైరల్ అయ్యాయి. ఆది, పాయల్ జోడికి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కిరాతక సినిమాకు సంబందించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
నగర శివారులోని మల్లారెడ్డి కాలేజ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా, ఈ షెడ్యూల్ లో పాయల్ పాల్గొంది. కాలేజ్ సీన్స్‌లో భాగంగా హీరోయిన్ ను హీరో ఆటపట్టించే సీన్లను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీలో జరుగుతున్న షూటింగ్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
వాటిని పాయల్ రాజ్ పుత్ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఇప్పుడూ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అన్నట్లు పాయల్ రాజ్ పుత్ టీఎంకే అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. మరి కొన్ని ప్రాజెక్టులు కధాచర్చల దశలో ఉన్నాయట.