ఫిల్మ్ డెస్క్- మీకు మహేశ్వరి గుర్తుందా.. దివంగత శ్రీదేవి బంధువుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మహేశ్వరి చేసింది కొన్ని సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మహేశ్వరి అనగానే తెలుగు ప్రేక్షకులకు గులాబి, పెళ్లి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు సినమాలు మహేశ్వరి కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
అలా కొన్ని సినిమాల తరువాత మహేశ్వరి హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇదిగో ఇన్నాళ్ల తరువాత మహేశ్వరి ఆలీతో సరదాగా షోకు గెస్టుగా వచ్చింది. ఈ సందర్బంగా మహేశ్వరి చాలా విషయాలను చెప్పుకొచ్చింది. శ్రీదేవీ తనకు అక్క వరస కాదని చెప్పిన మహేశ్వరి, పిన్ని వరస అవుతుందని అసలు విషయం చెప్పింది.
ఐతే తాను శ్రీదేవిని అక్కా అని పిలిచేదాన్ని అని చెప్పుకొచ్చింది. శ్రీదేవీ లేరని తాము అనుకోవడం లేదని, ఇంకా అబ్రాడ్‌లో షూటింగ్ కోసం వెళ్లినట్టే ఉందని, ఆమె లేదు అని తామెప్పుడూ అనుకోమని మహేశ్వరి కాస్త ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్బంగా గులాబీ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం గురించి అలీ ప్రశ్నించగా అప్పటి సంఘటనను గుర్తుకు చేసుకుంది మహేశ్వరి.
బైక్ మీద ఎక్కడం తనకు అంతగా అలవాటు లేదని, ఆ సమయంలో ఎదురు నుంచి ఓ వెహికల్ రావాలి, అప్పుడు బైక్ స్కిడ్ అయింది. హీరో గడ్డం చక్రవర్తి, తాను లోయలో పడిపోయామని చెప్పింది. ఐతేే అదృష్టవశాత్తు ఆ లోయ పది ఫీట్ల లోతే ఉందని, ఇంకొంచెం ముందు అయితే అంతే.. అంటూ ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి మహేశ్వరి వివరించింది.