రంగుల ప్రపంచం అయిన సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్లు అవకాశాలు దక్కించుకోవాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీన్నే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఇబ్బందులు పడ్డవారు, అవకాశాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్ల దగ్గరినుంచి ఔత్సాహిక నటీమణుల దగ్గరి వరకు అందరికీ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి.. ఎదురవుతున్నాయి. తాజాగా, తన అనుభవంలోని క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ప్రముఖ తమిళ నటి దేవీ ప్రియ చెప్పుకొచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నేను పెద్దగా డిస్ట్రబ్ అవ్వలేదు. అలాగని క్యాస్టింగ్ కౌచ్ లేనే లేదని నేను అనను. కచ్చితంగా ఉంది. కొన్ని చాలా డీసెంట్‌గా ఉండేవి. ఇష్టం ఉంటేనే.. లేదంటే పని దొరకదు అన్నట్లు ఉండేది. ఒక పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్ మన దగ్గరకు వస్తుంది. దానితో పాటు కమిట్‌మెంట్ ప్రసక్తి కూడా వస్తుంది. మనమేమో బాగా కలలు కంటాము. పెద్ద కాంట్రాక్ట్.. ఆ పెద్ద బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండనున్నామని అనుకుంటూ ఉంటాము. ఠక్కున కమిట్‌మెంట్ గురించి ప్రస్తావిస్తారు. అప్పుడు వెంటనే సారీ చెప్పేదాన్ని. యాడే వద్దు నన్ను వదిలేయండి అంటే.. ఆ అవకాశం వెళ్లిపోతుంది.
ఇలాంటివి చాలా అవకాశాలు నాకు పోయాయి. పెద్ద పెద్ద హీరోయిన్ల దగ్గరినుంచి చిన్న చిన్న వారి వరకు అందరూ ఈ అనుభవాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి వాటికి ఒప్పుకోలేదంటే.. వారి కలే నాశనం అయిపోతుంది’’ అని అన్నారు. కాగా, దేవీ ప్రియ ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించిన ‘వాలి’ సినిమాతో సినిమాల్లోకి వచ్చారు. ఈ సినిమాలో ఇంటర్వ్యూలో పాల్గొనే అమ్మాయిగా నటించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు. మరి, క్యాస్టింగ్ కౌచ్‌పై దేవీ ప్రియ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.