ఫిల్మ్ డెస్క్- పూరి జగన్నాధ్ పుట్టిన రోజును చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ రోజు మంగళవారం తన బర్త్ డేను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు పూరి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరిజగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం లైగర్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో లైగర్ సెట్లో పూరి పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేశారు పూరి జగన్నాధ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛార్మీ, విజయ్ దేవరకొండ తదితరులు పూరి పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేశారు. ఇక పూరి జగన్నాధ్ బర్త్ డే సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి మొదలు చాలా మంది పూరి జగన్నాధ్ కు విషెస్ చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అలా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి పూరి జగన్నాధ్ కాకుండా ఛార్మీ ధ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇస్తోంది. అంటే పూరి జగన్నాధ్, ఛార్మీ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. ఇద్దరు కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్నారనుకొండి.
అయినప్పటికీ పూరి జగన్నాధ్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు చెప్పిన వారికి ఇలా ఛార్మి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో రిప్లైస్ ఇవ్వడం మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. అన్నట్లు లైగర్ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
😘😘🙏🏻🙏🏻 https://t.co/t8ufXXfrOy
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Thaaank uuuuuu hottie 😘😭😘
Missing u 😭😘 https://t.co/hEXx79Fyi4— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Thanks a lot 🤗🤗
Puri garu says “ sooo happy to receive birthday wishes from a saint like u , love u a lot “ 🙏🏻 https://t.co/QOIYHw3QGK— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021