స్పెషల్ డెస్క్– అరియానా.. ఒకప్పుడంటే ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలియదు. బిగ్ బాస్ షోలోకి వెళ్లాక అరియానా కాస్త పాపులర్ అయ్యింది. ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తో ఫ్రెండ్ షిప్ తరువాత అరియానా ఎక్కడికో వెళ్లిపోయంది. అంటే ఆర్జీవీ తనను ఇంటర్వూ చేశాక అరియానా బాగా పాపులర్ అయ్యిందన్నమాట. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఓ వైపు బుల్లితెరపై షోలు, మరో వైపు సినిమాల్లో నటిస్తూ బాగా బిజీగా మారిపోయింది
ఇక అరియానా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు తన పాలోవర్స్ తో పంచుకుంటుంది. తాజాగా అరియానా తన ఫాలోవర్లకు ఓ శుభవార్త చెప్పింది. దీంతో అభిమానులంతా అరియానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఎందుకంటే అరియానా కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చేసింది. కొత్త మేంబర్ అంటే ఆమె పెళ్లి చేసుకుందని అనుకోకండి.
అసలు విషయం ఏంటంటే తాజాగా అరియానా కొత్త కారు కొంది. ఈమేరకు అరియానా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కియా సెల్టోస్ కారు కొన్న అరియానా, దాని ముందు నిలబడి ఫోటో దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అరియానా కొత్త కారు కొంటే, ఆమె కంటే కూడా సోహెల్, అమర్ దీప్‌లు సందడి చేశారు. ఈ ముగ్గురు కలిసి కొత్త కారులో షికారు చేసినట్టు తెలుస్తోంది.
అరియానాకు బిగ్ బాస్ షో ద్వార సోహెల్ ఫ్రెండ్ కాగా, సినీ ఇండస్ట్రీలో అమర్ దీప్ స్నేహితుడయ్యాడు. వీళ్లిద్దరు అరియానాకు క్లోజ్ ఫ్రెండ్స్. అమర్ దీప్ ఇప్పుడు జానకీ కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తున్నాడు. మొత్తానికి అరియానా కొత్త కారు కొన్న సంతోోషం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి మనం కూడా అరియానాకు శుభాకాంక్షలు చెబుదామా.