ఫిల్మ్ డెస్క్- సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కాస్త హవా తగ్గిందంటే చాలు… ప్రమోషన్స్ మొదలుపెడతారు. వారి వారి వెసులుబాటును బట్టి అందాలను ఆరబోస్తుంటారు. తాజాగా అందాల భామ అనూ ఇమాన్యుయేల్ ఇదే ఫార్ములాను అ నుసరించింది. ఈ మధ్య అనూకు కాస్త అవకాశాలు తగ్గాయి. ఇంకేముంది. అందాల ఆరబోత మొదలుపెట్టింది అనూ ఇమాన్యూయేల్.
స్వతతహాగా అందగత్తె ఐన అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్రం ద్వారా తొలిసారి వెండితెరకు పరిచమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ బాషల్లో పలు సినిమాల్లో నటించింది అనూ. 2016లో నాచురల్ స్టార్ నాని సరసన నటించిన మజ్నుసినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి, 2017 సంవత్సరంలో విశాల్ సరసన నటించిన తుప్పరివాళన్ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమైంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, గోపీచంద్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది అనూ ఇమాన్యుయేల్.
ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన ప్రేమ కాదంట చిత్రంతో పాటు, మహాసముద్రం చిత్రంలో నటిస్తోంది. అనూ అమాన్యుయేల్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టీవా గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ నెటిజన్లకు అందాలను పంచుతోంది. తాజాగా అనూ ఇమాన్యుయేల్ ఆరబోసిన అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.