తడిసిన చీరలో.. జారిపోయిన కొంగుతో.. అందాల విందు

  • Written By:
  • Updated On - September 4, 2021 / 01:36 PM IST

ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 సినిమాతో తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్త్ హీరోలుగా మహా సముద్రం మూవీని రూపొందించారు ఈ దర్శకుడు. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర మహా సముద్రం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మహా సముద్రం మూవీలో అందాల భామలు అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి హైదరీ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండనుందట. ఈ సినిమా నుంచి నటి రంభకు డెడికేట్ చేస్తూ.. హే రంభ రంభ అనే మాస్ పాటను విడుదల చేయగా, ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్దమైంది.

మహా సముద్రం సినిమా నుంచి.. చెప్పకే.. చెప్పకే.. అంటూ సాగే మరో పాటను సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపింది నిర్మాణ సంస్థ. ఈ మేరకు ఈ పాటకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అదితి హైదరీ తడి చీరలో, జారిపోయిన కొంగుతో, అందాల విందు చేస్తూ కవ్విస్తోంది. ఇక పోస్టరే ఇంత అందంగా ఉంటే ఇక పాట ఎంత బాగుంటుందో అని అభిమానులు అంటున్నారు.

మహా సముద్రం సినిమాలో జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్ నటులు ఉండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నట్లు మహా సముద్రం సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేస్తారట. మరి అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలాగే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV