కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి పడకలను ఏర్పాటు చేసింది. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు సొంతరాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘సైకిల్ పై సూపర్ మార్కెట్’ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సరికొత్త సూపర్ మార్కెట్‌కు సేల్స్ మ్యాన్‌గా మారారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సైకిల్‌పై కూర్చొని తన సూపర్ మార్కెట్‌ను సోనూసూద్ పరిచయం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గుడ్లు, బ్రెడ్ ఇతర వంట సరుకులను చూపిస్తూ సేల్స్ మ్యాన్ మాదిరిగా వాటి ధరను వివరించారు.
సోనూ సూద్ ఏంటి సైకిల్ పై గుడ్లు అమ్మడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. వాటి రేట్లు చెప్తూ గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్ముతున్నారు. డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది. దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ అవుతుంది. త్వరగా ఆర్డర్ చెయ్యండి అంటూ సోనూ సూద్ షేర్ వీడియో షేర్ చేసాడు. నిజంగా అవసరం ఉన్నవారికి, ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తూ వింత కోరికలు కోరే వారికి ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్న సోనూ సూద్ తాజా వీడియో వైరల్ మారింది.