మంచు మోహన్ బాబు.. తెలుగు చలనచిత్ర రంగంలో ఓ లెజండ్రీ యాక్టర్. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన మోహన్ బాబు.. ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలకి దూరం అయ్యారు. అయితే.. చాలా గ్యాప్ తరువాత కలెక్షన్ కింగ్ ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకి సిద్దమవుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే మోహన్ బాబు.. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
దర్శకుడు వి.ఎన్ ఆదిత్య యాంకర్ గా సాగిన ఈ ఇంటర్వ్యూలో పొలిటికల్ కామెంట్స్ కూడా మిక్స్ చేశారు మోహన్ బాబు. చంద్రబాబుతో స్నేహంగా మెలిగిన సందర్భాలను గుర్తు చేసుకున్న ఆయన., ఆ స్నేహంలో మోసపోయానని తెలిపారు. ఇక వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిలో ఓ రాజసం ఉంటుందని, జగన్ లో కూడా తండ్రి నేచర్ ఉందని మోహన్ బాబు తెలియచేశారు. ఇక 2019 ఎన్నికల్లో తాను జగన్ గెలుపు కోరుకున్నాను అని, అందులో తప్పు ఏముందని.. తన స్టాండ్ ని సమర్ధించుకున్నారు. ఇక సన్ ఆఫ్ ఇండియా చిత్ర విశేషాలను కూడా పంచుకున్నారు కలెక్షన్ కింగ్. మరి.. మోహన్ బాబు కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.