గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
ఇది చదవండి : రాకింగ్ రాకేష్ టీమ్ లో నవ్వులు పూయిస్తున్న ఈ నటి ఎవరు?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్ కు సమీపంలో ఆయన నివాసం ఉంది. ఇక ప్రతి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ షూటింగ్ సమయంలో శ్రీనివాస్ ఛాతికి దెబ్బతగలడంతో.. ఆస్పత్రికి వెళ్లగా అక్కడ గుండె సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆ కారణంగానే తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. శ్రీనివాస్‌కు తల్లి విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోగా.. తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు.
ఇది చదవండి : హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ మళ్లీ కలుస్తారు- కస్తూరి రాజా
శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పలు సీరియల్స్ లో కూడా నటించాడు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ తారలు ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.