గత కొన్ని రోజులుగా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతుంది. అయితే ఈ హిజాబ్ వివాదం పలు రాష్ట్రల్లో కూడా రాజుకుంది. అంతే కాదు హిజాబ్ వివాదం పై పలువురు సినీ నటులు కూడా తమదైన స్టైల్లో స్పిందించారు. తాజాగా కర్ణాటక హిజాబ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. హిజాబ్ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నడ నటుడు చేతన్‌కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నటుడు చేతన్ కుమార్ హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. చేతన్ కుమార్ ఐపిసి 505(2), 504 కింద చేతన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్వీట్ ఆధారంగా శేషాద్రిపురంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుత కర్ణాటక చీఫ్ జస్టిస్ కృష్ణ దీక్షిత్‌పై వివాదాస్పద ట్వీట్ చేశారు చేతన్‌కుమార్. కాగా, గతంలో ఓ రేప్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్‌ను ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు చేతన్‌కుమార్.
మరోవైపు తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నోటీసులు , కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. గత కొంత కాలంగా చేతన్ కుమార్ ఆదివాసీల హక్కుల కోసం ఆయన పోరాడారు. హిందూ సంస్థలకు వ్యతిరేకంగా కూడా చేతన్ పోరాడుతున్నారు.