కంటికి కనిపించేవే కాదూ.. ఇంకా అంతు పట్టని జీవ జాతులు అనేకం తన ఒడిలో దాచుకుంది ప్రకృతి. ఇప్పటికి అడవుల్లో, కొండ కోనల్లో ఎన్నో వింత జీవులు ఉన్నాయి. అయితే మారుతున్న వాతావరణం.. అడవుల నరికివేత, భూ ఆక్రమణ కారణంగా అడవుల్లో ఉన్న జంతు, జీవాలు ఆవాసాల వైపుకు వస్తున్నాయి
ప్రకృతి అనేక జీవ సముదాయాల సమ్మేళనం. మనుషులే కాదూ జంతువులు, పక్షులు, పురుగులు ఎన్నో భూమి మీద జీవిస్తున్నాయి. కంటికి కనిపించేవే కాదూ.. ఇంకా అంతు పట్టని జీవ జాతులు అనేకం తన ఒడిలో దాచుకుంది ప్రకృతి. ఇప్పటికి అడవుల్లో, కొండ కోనల్లో ఎన్నో వింత జీవులు ఉన్నాయి. అయితే మారుతున్న వాతావరణం.. అడవుల నరికివేత, భూ ఆక్రమణ కారణంగా అడవుల్లో ఉన్న జంతు, జీవాలు ఆవాసాల వైపుకు వస్తున్నాయి. దీంతో వాటి ఉనికి తెలుస్తుంది. తాజాగా ఓ వింత పురుగు..ఒకటి ప్రత్యక్షమైంది. అదీ చూసిన చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంటే అదీ మనిషి తలను పోలి ఉండటమే. దాన్ని అంతా వింతగా చూస్తున్నారు.
ఈ వింత పురుగు గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామంలో తిరుగుతూ కనిపించింది. హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర ఇది దర్శనమిచ్చింది. ఈ పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల.. అంటే మనిషి తలభాగం మారిది కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి పురుగు దర్శనమిచ్చిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో కూడా ఇలాగే మనిషి ఆకారంలో ఉన్న పురుగు కనిపించింది. గద్వాల పట్టణంలోని శేర్లి వీధికి చెందిన ఒక వ్యక్తి తెల్లవారుజామున టీ తాగేందుకు బయటకు వస్తున్న సందర్భంలో ఆ వింత పురుగు ఈయనకు కనిపించిందట. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత మనిషి ముఖం ఆకారంలో ఉన్న వింత పురుగును చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త పక్క గ్రామాలకు పాకింది.