ధనలక్ష్మి తలుపు తట్టడం కాదు.. ఏకంగా బద్దలుకొట్టుకొని వచ్చి పడింది. ఒకే ఒక్క లాటరీ టిక్కెట్టు కొన్న వ్యక్తికి రూ.10,588 కోట్ల లాటరీ తగిలింది. అదృష్టం అంటే అతనిదే కాదా..? ఈ జాక్‌పాట్ అమెరికాలోని మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొన్న ఒక వ్యక్తికి తగిలింది. ఇలినాయీ రాష్ట్రంలో కుక్‌కౌంటీలోని ఓ స్టోర్లో మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలింది.
కాగా గత ఐదేళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్ద జాక్‌పాట్. ఆ దేశ చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్ కూడా ఇదే. కాగా ఈ అదృష్టంలో ఒక ట్విస్ట్ ఉంది. గెలిచిన మొత్తాన్ని ఒకే సారి విన్నర్‌కు ఇవ్వరు. గెలిచిన 133.7 కోట్ల డాలర్లు.. విజేతకు ఏడాదికి కొంత చొప్పున 29 ఏళ్ల పాటు ఇవ్వనున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Lottery official confirms that Mega Millions ticket sold in Illinois is the sole winner of the estimated $1.28B jackpot.. the winner will walk away with about $700,000,000 after taxes. pic.twitter.com/97HWtXkHgb
— SAY CHEESE! 👄🧀 (@SaycheeseDGTL) July 30, 2022