లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా మహేష్ బాబుతో సినిమా తీస్తానని వెల్లడించగానే అందరిలో ఆతృత మొదలైంది. అయితే ఇందుకు మంచి స్క్రిప్ట్ సిద్దం కావాలని అంటున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘నవరస’. ఆగస్ట్ 6న దీనిని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మణిరత్నం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహేశ్ కథ విన్నారని కానీ, కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. కథలను బట్టే నటీనటులను ఎంపిక చేసుకుంటాను అని త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఏ విషయానికైనా సమయం సందర్భం రావాలని ఆయన అన్నారు.
ఇక మహేశ్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్‌తో ఓ సినిమాతో చేయబోతున్నాడు. దీని తర్వాత రాజమౌళితో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.