ఇంటర్నేషనల్ డెస్క్- ప్రేమ భలే విచిత్రమైంది. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఎవరిమీద ప్రేమ పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇక ప్రేమకు వయసుతో నమిత్తం లేదని కూడా అంటారు. సహజంగా వయసులో ఉన్న వాళ్లు ఎక్కువగా ప్రేమలో పడుతుంటారు. కానీ అప్పుడప్పుడు వయసు మీరినాక కూడా ప్రేమించుకుంటుంటారు. అందుకో కొందరు ప్రేమ గుడ్డిది అని కూడా అంటుంటారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఆమె వయసు 61, ఆ యువకుడి వయసు 24. జీవితాన్ని మొత్తం చూసిన అనుభవం ఆమెదైతే, పాతికేళ్లు కూడా దాటని యుక్త వయసు అతడిది. కానీ వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు, పెల్లి కూడా చేసుకున్నారు. ఆ వృద్ధ వనిత పేరు షెరిల్ మెక్‌గ్రెగోర్, ఆ యువకుడి పేరు కొరాన్ మెక్‌కెయిన్. అమెరికాలో జరిగిన ఈ ఆసక్తికరమైన పెళ్లి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
షెరిల్, కొరాన్‌లు అమెరికాలో జార్జియా రాష్ట్రంలో నివసిస్తున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం 2013లో వారికి తొలిసారిగా పరిచయమైంది. అప్పుడు ఆ యువకుడు కొరాన్ వయసు కేవలం 15 సంవత్సరాలే. షెరిల్ కొడుకుకు సంబందించిన షాపులో వారు మొదటిసారి కలిశారు. అది వారిద్దరి స్నేహానికి దారి తీసింది. ఆ తరువాత ఏడేళ్లకి 2020 నవంబర్ 4న షెరిల్, కొరాన్‌లు రెండోసారి కలిశారు. అంతే స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో కొరాన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో షెరిల్‌కు ప్రపోజ్ చేయగా, ఆమె అతడి ప్రేమను అంగీకరించేసింది.
ఇంకేముంది ఎవ్వరు ఊహించని విధంగా సెప్టెంబర్ 3న వీళ్లిద్దరు పెళ్లిచేసుకున్నారు. వారిరువురికి సన్నిహితులైన అతి కొద్దిమంది మాత్రమే ఈ వివాహానికి వచ్చారు. ఈ జంట తమ పెళ్లి వేడుకను టిక్ టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చింది. ఇక షెరిల్‌కు ఏడుగురు పిల్లలైతే వారిలో ముగ్గరు ఈ ఆమె పెళ్లిని వ్యతిరేకించారు.
ఇక షేరిల్ అందమైన మహిళే కాదు, నిజాయితీపరురాలు, మానసికంగా ధృఢమైనది అని చెప్పుకొచ్చాడు కొరాన్. తాను డబ్బు కోసమే షెరిల్‌ను పెళ్లి చేసుకుంటుంన్నట్టు కొందరు భావించారని, మమల్ని ఎవరెంత ద్వేషించినా సరే, మేము మాత్రం అందరిలాగే సాధారణ జీవితాన్నే గడుపుతున్నామని కొరాన్ చెప్పుకొచ్చాడు. మరి ఈ జంటకు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదామా..