కొంత మంది చిన్నారులు అపరమిత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. చిన్న వయస్సులోనే చదువులో ఆరితేరుతారు. ప్రతి విషయంపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనమన్న పేరు తెచ్చుకుంటారు. ఆ కోవకు వర్తిస్తుంది ఈ బాలిక కూడా.
వయస్సులో చిన్నగా ఉన్నప్పటికీ మేథస్సులో పరిమితికి మించి పరిణతిని కనబరుస్తుంటారు కొంత మంది పిల్లలు. అపరమిత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. చిన్న వయస్సులోనే చదువులో ఆరితేరుతారు. అటువంటి చిన్నారులకు మేథో సంపత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంపై అవపోసన పడతారు. ఏ విషయమైనా ఇట్టే పసిగట్టేయగలరు. అటువంటి వారికి కొంచెం ప్రోత్సహిస్తే చాలు కన్న తల్లిదండ్రలకే కాదూ దేశానికి మంచి పేరు తెస్తారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఇటువంటి చిన్నారులకు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక తనలో ఉన్న ప్రతిభతో ఔరా అనిపిస్తోంది.
ఏపీలోని కాకినాడ జిల్లాకు చెందిన ముప్పాళ్ల సురేష్, మణి దంపతులు. వీరికి హేమశ్రీ అనే కుమార్తె ఉంది. ఆమె చదువులో దిట్ట. ఆరవతరగతి చదువుతున్నప్పటికీ.. తన వయస్సుకు మించిన విషయాలపై అవగాహన. పై తరగతులకు సంబంధించిన విషయాలను కూడా చదివి చెప్పేగల నేర్పరి. తండ్రి ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి మణి గృహిణి. హేమశ్రీ గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అయితే ఈ ఏడాది జరిగే పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. ఆరో తరగతి చదువుతున్నప్పటికీ ఆమెలో తెలివితేటలు చాలా ఎక్కువ. ఈ విషయాన్ని ఆమె చదువుతున్న ఉపాధ్యాయులు గుర్తించారు. ఆమెకున్న జ్ఞానం గురించి ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు.
అయితే మార్చి 27న అమరావతిలోని సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ హేమశ్రీ ప్రతిభకు పరీక్ష పెట్టారు. 20 నిమిషాలకు పైగా ఆమెకు పలు ప్రశ్నలు సంధించి.. సమాధానాలు రాబట్టారు. విద్యార్థిని హేమశ్రీ ఐక్యూను ప్రశంసించి, పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిఫార్సు చేశారు. శుక్రవారం పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ జి.దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో హేమశ్రీను అభినందించి హాల్‌టికెట్‌ను అందజేశారు. చిన్నప్పటి నుంచి తమ కుమార్తెకు తెలివితేటలు ఎక్కువని, 2022 అంతర్జాతీయ స్థాయిలో భగవద్గీత పోటీల్లో బంగారుపతకం సాధించిందని తల్లి మణి తెలిపారు. సంస్కృత పోటీల్లో లెవెల్-1లో రాష్ట్రంలో మొదటిస్థానం, వేమన శతక రచన అవార్డు, పదేళ్లలోపే అనేక బహుమతులు సాధించినట్లు పేర్కొన్నారు.