దేశవ్యాప్తంగా నేడు వినాయక చవితి శోభ సంతరించుకుంది. వాడవాడలా గణేష్ మండపాలు వెలిశాయి. వివిధ రూపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచంలోనే అత్యంత విలువైన వినాయకుడు కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్లు విలువ చేసే సహజ సిద్ధమైన వజ్ర గణపతి డైమండ్ సిటీలో కొలువుదీరాడు. అత్యంత విలువైన ఈ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని మహీదర్‌పురాకు చెందిన కరమ్ గ్రూప్ చైర్మన్ వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఈ వజ్ర వినాయకుడిని బెల్జియం నుంచి తీసుకొచ్చారు. 12 ఏళ్ల క్రితం వజ్రాల కొనుగోలు కోసం యాంట్‌వెర్ప్‌కు వెళ్లినప్పుడు ఆయన ఈ వజ్రాన్ని కనుగొన్నారు.
ప్రస్తుతం ఈ వినాయకుడికి కనుభాయ్ ఇంట్లోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏడాది ఒకసారి వినాయక చవితికి మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ విఘ్నేశ్వరుడు స్వయంగా వజ్రాల రూపంలో మనపై కురిపించిన అమూల్యమైన ఆశీర్వాదం అని, అందుకే ఈ వజ్రాన్ని తాను అమ్మకానికి పెట్టడం లేదని కనుభాయ్ అంటున్నారు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సహజ వజ్రం వినాయకుడు ఇదే.. ఈ విగ్రహాన్ని ఏడాది పొడవునా చాలా సురక్షితమైన, రహస్య ప్రదేశంలో ఉంచుతానని.. కనుభాయ్ తెలిపారు. మరి అత్యంత విలువైన ఈ వజ్ర వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే అపాయింట్‌మెంట్ తీసుకుంటారని సమాచారం. మరీ మీరు కూడా ఆ వజ్ర వినాయకుడిని దర్శించాలను కుంటే.. వచ్చే ఏడాది ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకుని.. చవితి నాడు వెళ్లి దర్శనం చేసుకోండి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది!
*The most valuable Ganesha idol in the world*
The Ganesh idol in the house of Kanubhai Asodia, who is in the diamond business in Surat, has been recorded as the most expensive idol in the world. Weighing 182.3 carats and weighing 36.5 carats, this diamond is self-contained. pic.twitter.com/W8iqSuiqBd
— Dhiren Gupta (@GuptaDhiren) September 18, 2021