మనలో చాలామంది రెస్టారెంట్స్ కి వెళ్తుంటాం. బిర్యానీ ఆర్డర్ ఇస్తుంటాం. కొన్నిసార్లు త్వరగా తీసుకొచ్చేస్తుంటారు. మరి కొన్నిసార్లు మాత్రం కాస్త ఆలస్యమవుతూ ఉంటుంది. ఇంత లేట్ ఎందుకు అయిందని మనలో మనమే ఫ్రస్టేట్ అయిపోతాం కానీ దాన్ని చాలావరకు బయటపెట్టాం. కానీ ఓ ముగ్గురు మాత్రం.. రెస్టారెంట్ ఉద్యోగినే చితకబాదారు. అంతటితో ఆగకుండా దారుణంగా ప్రవర్తించారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాలో అన్సల్ ప్లాజా మాల్ లో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి పదిన్నర సమయంలో ఓ ముగ్గురు వ్యక్తులు.. జాక్ రెస్టారెంట్ కి వచ్చారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే చెప్పి చాలాసేపు చాలాసేపు అయిపోయింది. ఈ క్రమంలోనే అందులోని ఒకడు ఫ్రస్టేషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆర్డర్ వచ్చేలోపే బిల్ కౌంటర్ దగ్గర పనిచేసుకుంటున్న అల్తాఫ్ అనే ఉద్యోగిపై దాడి చేశాడు. సీట్లో నుంచి అతడిని బయటకు లాగి.. నేలపై పడేసి ఎక్కడపడితే అక్కడ గుద్దుతూ తన ప్రతాపం చూపించాడు.
ఇక అక్కడితో ఆగకుండా రెస్టారెంట్ బయటకు తీసుకొచ్చి మరీ అతడిని కిందపడేసి మరీ ముగ్గురు కాలితో తన్నారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీలో రికార్డయింది. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే విషయమై ఎన్డీటీవీతో మాట్లాడిన గ్రేటర్ నోయిడా అడిషనల్ డీసీపీ.. దాడి చేసిన ఆ ముగ్గురు వ్యక్తుల్ని ప్రవేశ్, మనోజ్, క్రెస్ గా గుర్తించామని అన్నారు. వాళ్ల ముగ్గురిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం ఈ ఘటన విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
3 Men In Greater Noida Mercilessly Thrash Restaurant Employee For Late Biryani Order https://t.co/1X09d10FlC pic.twitter.com/00tdWq4Fyq
— NDTV (@ndtv) November 11, 2022