ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమాన్నే కాంక్షిస్తాయి. కానీ.., అప్పటి పరిస్థితిలను బట్టి కొన్ని పనులు చేయగలుగుతారు, కొన్ని చేయడానికి కుదరదు. ఇది అన్నీ రాష్ట్రాలలో జరిగేదే. కానీ.., ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక మాట చెప్తే.., అది అమలు అయ్యే వరకు వెనకడుగువేయడం లేదు. తాజాగా విశాఖలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణమే ఇందుకు సరైన ఉదాహరణ.
రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారంటూ ఉండకూడదని జగన్ పక్కా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఇదే సమయంలో ప్రజలందరికీ స్థలాలు కూడా కేటయించారు. ఈవిషయంలో రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే విశాఖలో జరిగిన కార్యక్రమం ఒక ఎత్తు. విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత అక్కడ గజం స్థలం కూడా లక్షలకి చేరుకుంది. ఇలాంటి సమయంలో అంతటి ప్రైమ్ ఏరియాలో పేద ప్రజలకి పక్కా ఇల్లు నిర్మించాలంటే ఏ ప్రభుత్వాలైన కాస్త ఆలోచిస్తాయి. ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తాయి. కానీ.., జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. చెప్పిన వారికి, చెప్పిన దగ్గరే పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూసినా విశాఖలో ఒక్కో ఇల్లు సుమారు పాతిక లక్షలు ఖరీదు చేస్తుంది. దీనిని బట్టీ చూస్తే భవిష్యత్తులో లబ్దిదారులు అంతా కోటీశ్వరులే. పైగా.., రాజధాని ప్రాంతంలో స్థిర నివాసం అంటే మాటలు కాదు. దీంతో.., విశాఖ ప్రజలు అదృష్టవంతులన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా కొన్ని విమర్శలు లేకపోలేదు. ఇలా.. ప్రైమ్ ఏరియాలో స్థలాలు పంచేస్తే.. రేపు అభివృద్ధి కోసం స్థలం ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. కానీ.., జగన్ మాత్రం మాట ఇచ్చాను, తప్పను అంటూ ఇలానే ముందుకి సాగిపోతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.