భారత క్రికెట్‍ను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‍లో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రిషబ్.. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
భారత క్రికెట్‍ను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‍లో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రిషబ్.. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అలాగే ఇటీవల కాలంలో భారత మాజీ క్రికెటర్ సలీం అజీజ్ దురానీ కన్నుమూశారు. ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ తండ్రి కూడా ఈ ఏడాదే చనిపోయిన సంగతి విదితమే. ఇప్పుడు మరో వార్త క్రీడాలోకాన్ని శోక సంద్రంలో ముంచెత్తుతోంది. గతంలో భారత జట్టుకు మేనేజర్ గా వ్యవహరించిన సునీల్ దేవ్ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు.
సునీల్ దేవ్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2007 టీ 20 ప్రపంచ కప్ అందరికీ గుర్తిండిపోతుంది. ఆ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించి సునీలే. ధోనీ సారథ్యంలో 2007లో టీ-20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సునీల్ దేవ్ మాజీ క్రికెటర్ కూడా.. 1969-70ల్లో ఢిల్లీలో ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్ టూర్‌లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. గతంలో సునీల్ దేవ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్ దేవ్ బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా తన సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.