మాములుగా మనుషుల కడుపులో ఏముంటాయి? హ.. ఏముంది? చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, జీర్ణ వ్యవస్థ ఇలా చాలా ఉంటాయని అంటారా? ఇంత వరకు అంతా కరెక్టే గాని.., మన పొట్టలో వెంట్రుకులు కూడా కొన్ని పేరుకుపోయి ఉంటాయి. మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో అవి మనకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇలా.. లోపలి వెళ్లిన వెంట్రుకులు ఒక ముద్దులా చుట్టుకుని అక్కడే ఉండిపోతాయి. వీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. కానీ.., కడుపులో ఈ హెయిర్ బాల్స్ పరిమాణం పెరిగిపోతే మాత్రం తీవ్ర కడుపు నొప్పితో, ప్రాణాలు పోయినంత పని అవుతుంది. ఒక్కోసారి నిజంగా ప్రాణాలకి కూడా ప్రమాదం తప్పకపోవచ్చు. కానీ., హెయిర్ బాల్స్ కేసులు ఇంత సీరియస్ అవ్వడం అరుదు. వీటికి ఆపరేషన్ నిర్వహించాల్సి రావడం ఇంకా అరుదు.
తాజాగా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. గగన్ పహాడ్ కి చెందిన 17 ఏళ్ల యువతి కడుపు నొప్పితో బాధపడుతుంగా… పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగుల్లో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపులోంచి 2 కిలోల బరువున్న వెంట్రుకల ముద్దను తొలగించారు. వెంట్రుకలు కడుపులో పేరుకుపోవటం సాధారణ సమస్యే అయినా, చిన్న పేగులు, జీర్ణాశయంలోనూ వెంట్రుకలు నిలచిపోవటం చాలా అరుదైన విషయంగా వైద్యులు పేర్కొన్నారు.
ఈ నెల 2న పూజితకు శస్త్రచికిత్స నిర్వహించిన ఉస్మానియా వైద్యులు… బాధితురాలు ఆరోగ్యంగా ఉన్నందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహాలో ఇప్పటి వరకు 68 కేసులు మాత్రమే గుర్తించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర తెలపడం విశేషం. పాప గత కొన్ని నెలలుగా తల వెంట్రుకులు కట్ చేసుకుని.., వాటిని నమిలి మింగేస్తూ ఉండటం, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని డాక్టర్స్ తెలియచేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.