2007 సెప్టెంబర్ 19 దక్షణాఫ్రికాలో జరగుతున్న మొట్టమెదటి టీ20 వరల్డ్ కప్. గ్రూప్ ఈలో ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ హాఫ్ సెంచరీలతో మంచి ఆరంభం ఇచ్చారు. భారత్ స్కోర్ 153 వద్ద ఊతప్ప అవుట్ అవడంతో క్రీజ్‌లోకి వచ్చిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ మధ్య మాటల యుద్ధ జరగింది. 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ యువీ ఆగ్రహానికి బలయ్యాడు. 6 బంతులను 6 సిక్సులుగా మలిచి యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ 6 సిక్సులు బాది నేటికి 14 ఏళ్లు. అదే ఊపులో ఇండియా మొట్టమెదటి టీ20 వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
#OnThisDay in 2007, @YUVSTRONG12 went berserk and hammered 6⃣ sixes in an over to score the fastest ever T20I fifty. 🔥 👏#TeamIndia pic.twitter.com/vt9Lzj1ELv
— BCCI (@BCCI) September 19, 2021