125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానందకు సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. చేసేపనిలో నిస్వార్థం నిబద్దత ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యోగ గురువుకు పద్మశ్రీ అవార్డు వరించడమే. ఆయన అవార్డు అందుకున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రధానికి, రాష్ట్రపతికి పాదాభివందనం చేసి అవార్డు అందుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద నమస్కరించిన తీరు భారతదేశ నిజమైన సంస్కృతికి నిదర్శనం అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే 125 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యం పరంగా ఇంతలా ఎలా ఫిట్ గా ఉన్నారు? ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటి? అనేది ప్రతి ఒకరి మదిలో మెదిలో ప్రశ్న. మరి.. యోగా గురువు స్వామి శివానంద గురించి ఇప్పుడు తెలుకుందాం..
ఒడిశాకు చెందిన యోగా గురువు స్వామి శివానంద చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. తల్లిదండ్రుల అంత్యక్రియలను తిరష్కరించి బ్రహ్మచర్య మార్గం ఎంచుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన జీవితాన్ని మానవ సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లోని గురూజీ ఆశ్రమంలో శివానంద చేరారు. అక్కడ గురు ఓంకారానంద గోస్వామి అతన్ని పెంచారు. అక్కడ నేర్చుకున్న ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా పాటించేవారు. పాఠశాల విద్య, యోగాతో సహా అన్ని ఆచరణాత్మక మరియు ఆధ్యాత్మిక విద్యను అందించారు.స్వామి శివానంద ఉదయం 3 గంటలకే నిద్రలేచి యోగా చేయడం అలవాటు. శివానంద ఎప్పుడూ నూనె, మసాలాలు లేని చాలా సులభమైన ఆహారాన్ని తీసుకుంటారు. పాలు లేదా పండ్లు తీసుకోవడం కూడా మానేశారు. స్వామి శివానంద 2019లో బెంగళూరులో యోగారత్న అవార్డుతో సహా పలు అవార్డులను అందుకున్నారు. స్వామి శివానంద ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితంపై అంతర్జాతీయ మీడియా సంస్ధలు దృష్టిసారించాయి. 40,50 ఏళ్లకే ఆరోగ్య సమస్యలు వస్తున్న ఈ కాలంలో 125 వయస్సులోనూ ఆరోగ్యంగా ఉన్న యోగా గురువు స్వామి శివానందపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Just look at the power of #YOGA – a priceless gift from Sanatan Dharma..!!
Watch this inspiring video of 125 year old Yoga Guru Swami Sivananda – an oldest man ever to receive a #PadmaShri award.
😍😍👇 pic.twitter.com/fzRSJjEK8K
— Dr. Mamata R. Singh (@mamatarsingh) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.