ఆ ఇంట్లో దెయ్యం ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారు. జేమ్స్ అనే పర్యాటకుడు తాజాగా, ఆ ఇంటికి వద్దకు వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వెయ్యి బొమ్మల వెనుక కన్నీటి కథ ఉంది.
మనం చూసేది.. మన కళ్లకు కనిపించే ప్రతీది నిజం కాదు. కొన్ని సార్లు మన ఊహలు, అభిప్రాయాలు మనం చూసే దాని మీద ప్రభావం చూపుతాయి. మన దృష్టి కోణం నుంచి తప్పుగా అనిపించే ప్రతీది.. వాస్తవానికి తప్పు కాకపోవచ్చు. తరచి చూస్తే మనకు తప్పుగా అనిపించే ప్రతీ దాంట్లో ఓ విషాదం దాగి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో కూడా అంతే.. జనాల్ని భయపెడుతున్న ఓ బొమ్మల ఇంటి వెనుక.. కన్నీళ్లు తెప్పించే ఓ కథ ఉంది. చనిపోయిన బిడ్డల కోసం బొమ్మలు దాచిన తల్లి ప్రేమ దాగి ఉంది. ఇంతకీ ఏంటా ఇళ్లు.. ఆ తల్లి కథ ఏంటి? అన్న పూర్తి వివరాల్లోకి వెళితే.. స్పెయిల్లోని సివెల్లేకు చెందిన ఓ ఇళ్లు 2017నుంచి ఎవ్వరూ లేకుండా అలానే పడి ఉంది.
ఆ ఇంటి గురించి చుట్టు పక్కలి వారు ఒక్కోరు ఒక్కో విధంగా అనుకుంటూ ఉన్నారు. చాలా మంది ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని.. అదో దెయ్యాల కొంప అని అనుకోవటం మొదలుపెట్టారు. తాజాగా, కేంబ్రిడ్జ్‌కు చెందిన బెన్ జేమ్స్ అనే పర్యాటకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఇంటి గురించి తెలుసుకున్నాడు. అందరినీ భయపెడుతున్న ఆ ఇంటి గురించి తెలుసుకోవాలని అతడు భావించాడు. అనుకున్నదే తడువుగా ఆ ఇంటి దగ్గరకు వెళ్లాడు. లోపలకి వెళ్లిన అతడికి ఇంటి నిండా బొమ్మలు కనిపించాయి. దాదాపు అక్కడ 1000 బొమ్మల దాకా ఉన్నాయి. ఆ ఇంటిని అతడు ఫొటోలు తీశాడు.
తర్వాత వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘‘ ఆ ఇంట్లో 2017 వరకు ఓ ఒంటరి మహిళ ఉండేది. ఆమె ఇద్దరు పిల్లలు చనిపోయారు. చనిపోయిన పిల్లలకు గుర్తుగా ఉండటానికి ఆమె 1000 దాకా బొమ్మలు చేర్చి పెట్టింది. 2017లో ఆమె చనిపోయింది. ఇక, అప్పటినుంచి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు. ఇప్పుడా ఇళ్లు దెయ్యం ఇళ్లుగా పేరుబడింది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.