తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ జోడీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పంచ్ డైలాగ్‌లతో నవ్విస్తూనే.. లవ్‌ట్రాక్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ప్రేక్షకుల నాడిని పసిగట్టిన చానెల్స్.. టీఆర్పీ రేటింగ్ పెంచుకొవటం కోసం ప్రతి షోలో ఈ లవ్ ట్రాక్ లని రెడీ చేస్తున్నాయి. ఇక టాస్క్‌లో భాగంగా ఈ జోడీలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు సాగే ఎపిసోడ్‌లు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. దీంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లో కూడా అగ్రభాగానికి దూసుకెళ్తున్నాయి బుల్లితెర ఛానెల్స్.
ఇక బుల్లితెరపై ఎవర్‌గ్రీన్ జోడి రష్మి-సుధీర్. టెలివిజన్ చరిత్రలో ఈ జోడీ మీద చేసినన్ని కార్యక్రమాలను మరే జోడి మీద చేసి ఉండరు. ఏడేళ్లుగా వారి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ.. జనాలను ఆకట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు షోలో వీరి మధ్య చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికి చాలా మంది ప్రేక్షకులు వీరు నిజమైన లవర్స్ అనే అనుకుంటారు. గత కొన్నేళ్లుగా ఈటీవీలో ఢీ, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో ఈ జోడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సుధీర్ ఈటీవీ నుంచి బయటకు వెళ్లిపోయాడు. రష్మి మాత్రం ఈటీవీలోనే కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Sai Pallavi: సుడిగాలి సుధీర్ పై సాయి పల్లవి పంచ్ లు! రే హౌలే అంటూ..!
ఈ క్రమంలో తాజాగా ఫాదర్స్‌డే సందర్భంగా జీటీవీ స్పెషల్ షో చేసింది. ఈ సందర్భంగా సుధీర్ హర్డ్‌కోర్ ఫ్యాన్స్‌ని కొందరిని షోకు తీసుకువచ్చారు. అలా వచ్చిన వారిలో ఓ యువతి.. సుధీర్‌ని హగ్ అడిగటంతో తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఓ చిన్న కుర్రాడు.. సుధీర్‌ని బాబాయ్ అంటూ.. తనకి ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత రష్మి పిన్ని ఎక్కడ అని ప్రశ్నించగా.. అందుకు సుధీర్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ వెంటనే తేరుకొని.. తను నా గుండెల్లో ఉంటుంది.. మీకు కనిపించదు అన్నాడు. సుధీర్ కామెంట్స్ ప్రస్తుతం వైరలవుతోన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Pranitha Subhash: సాయి పల్లవికి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రణీత సుభాష్