సినిమా అన్నాక ప్రమోషన్ చేసుకోవాలి. లేదంటే సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కష్టం. అందుకే హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలను విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. స్టార్ డమ్ ఉన్న నానినే తన దసరా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అయితే నటులు ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు, ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక నటి విషయంలో ఇదే జరిగింది. మీరు ఎంచక్కా నీలి చిత్రాలు చేసుకోవచ్చు కదా అని ఒక యూట్యూబర్ అడగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.
మంగళ గౌరి మదువే, ఇంతి నిమ్మ ఆశ వంటి పలు సీరియల్స్ లో నటించిన కన్నడ నటి తనీషా కుప్పండ పెంటగాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటిస్తోంది. ఒక పాటలో బ్యాక్ లెస్ గా కనిపించడమే కాకుండా.. లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. కాగా ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది. తనీషా కుప్పండ పలు ఇంటర్వ్యూలో చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మీరు నీలి చిత్రాల్లో నటిస్తారా? మీరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటే నీలి చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని సదరు యూట్యూబర్ ఆమెను ఇబ్బందికర ప్రశ్నలు అడిగాడు. దీంతో ఇంటర్వ్యూ మధ్యలో యూట్యూబర్ పై నటి తనీషా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కన్నడ పరిశ్రమలో ఉండకుండా.. నీలి చిత్రాల్లో నటించాలి అని తనని అడిగిన ప్రశ్నలో అర్థం లేదని, ఎందుకు ఈ ప్రశ్న అడిగావంటూ యూట్యూబర్ పై మండిపడింది. కామన్ సెన్స్ లేదా? ప్రశ్న అడిగే ముందు ఆలోచించవా? అంటూ అతనిపై ఆవేశంతో ఊగిపోయింది. అయితే యూట్యూబర్ ఇలా అడగడానికి కారణం.. పెంటగాన్ సినిమాలోని ఓ పాటలో తనీషా ఘాటుగా నటించింది. అది తట్టుకోలేక కుర్రాడు క్వశ్చన్ అడిగేశాడు. దీనికి నటి కూడా గట్టిగానే బదులిచ్చింది. సినిమాలో బోల్డ్ గా నటించినంత మాత్రాన నీలి చిత్రాల్లో నటించాలా? తాను పో*ర్న్ స్టార్ ను కాదని విరుచుకుపడింది. కన్నడ సినీ పరిశ్రమలో ఎవరు నగ్న సినిమాలు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి సభ్యత లేని ప్రశ్న అడిగారు అంటూ ఆమె యూట్యూబర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదే సమయంలో పెంటగాన్ చిత్ర బృందంలో ఒకరు కలగజేసుకుని.. యూట్యూబర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే ప్రశ్నను నీ ఇంట్లో అక్కనో, చెల్లినో అడుగుతావా? అంటూ క్లాస్ తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక మహిళను పట్టుకుని అలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి అంటూ కొందరు మండిపడుతున్నారు. ఆహా మహిళను అనకూడదు గానీ మగాళ్లను అలాంటి ప్రశ్నలు అడగొచ్చా.. ఎవరిని అడిగినా తప్పు తప్పే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. తెలివి ఎక్కువ సంఘానికి అధ్యక్షులైన కొందరు మాత్రం ఇది ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ లో భాగమని, దీన్ని నమ్మాల్సిన పని లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? పబ్లిసిటీ స్టంట్ అని అనుకుంటున్నారా? లేక నిజంగానే సీరియస్ మేటర్ అంటారా?