యూట్యూబ్ వినియోగం పెరిగాక.. లోకల్ టాలెంట్‌కి మంచి గుర్తింపు వస్తోంది. చాలా మంది సొంతంగా చానెల్ క్రియేట్ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే బమ్‌చిక్ బబ్లూ. యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి.. గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ.. ప్రస్తుతం బబ్లూ మాయ అనే యూట్యూబ్ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తాజాగా బబ్లూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి తన అభిమానులతో పాటు నెటిజనులను షాకయ్యేలా చేశాడు. ఇంతకు బబ్లూ షేర్ చేసిన ఫోటోలు దేనికి సంబంధించినవి అంటే.. అతడి పెళ్లి ఫోటోలు.
ఇది కూడా చదవండి: మళ్లీ జతకట్టిన సుధీర్ – రష్మీ.. ఈసారి మామూలుగా లేరుగా!
ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ మధ్య యూట్యూబ్ చానెల్ ఉన్న ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఎవరి పెళ్లి అయినా సరే.. వారం రోజుల ముందు నుంచే హంగామా చేస్తూ.. వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. ప్రమోట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాంటిది బబ్లూ పెళ్లి గురించి ఎక్కడా ఎలాంటి వీడియో కానీ సమాచారం కానీ లేదేంటి అనుకుంటున్నారు నెటిజనులు. అంతేకా బబ్లూ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇక బబ్లూ తన ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేస్తూ.. జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్ అంటూ పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి: షోలో గెటప్ శ్రీనుకి అవమానం! ఏమైందంటే?
ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. యూట్యూబ్ ద్వారా బాగానే క్రేజ్ సంపాదించుకున్న బబ్లూ… ఇలా రహస్యంగా ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పైగా ఈ మధ్య చాలామంది తన సినిమాలు, షోల ప్రమోషన్ కోసం ఇలా ఉత్తుత్తి పెళ్లిల్లు, లవ్ ప్రపోజల్స్‌తో సోషల్‌మీడియాలో హల్చల్ చేశారు. బబ్లూ కూడా అలానే ఏదైనా వీడియో ప్రమోషన్ కోసం ఇలా చేశాడా లేక నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అని కామెంట్ చేస్తున్నారు నెటిజనుల. ఏది ఏమైనా బబ్లూకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. బ్యూటిఫుల్ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ పలువరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.