‘మెహబూబా’ తర్వాత ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్స్ బ్యానర్ పై అనిల్ పాడురి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం “రొమాంటిక్”. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించటం విశేషం. అలాగే సునీల్ కాశ్యప్ అందించిన మ్యూజిక్ సినిమాకి బిగ్ ఎస్సెట్ కానుంది.
కాగా ఈ చిత్రం ట్రైలర్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 19న మంగళవారం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈనెల 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాతో ఆకాష్ పూరి కి బిగ్గెస్ట్ బ్రేక్ రానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ చిత్ర యూనిట్ ని బ్లెస్స్ చేసి ఆకాష్ కి రొమాంటిక్ సినిమా మంచి సక్సెస్ కావాలని అన్నారు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.