ఓ మహిళ సినిమా చూడ్డానికి తన పిల్లలతో కలిసి థియేటర్‌కు వెళ్లింది. లోపల సినిమా చూడ్డానికి కూర్చుని ఉంది. అయితే, అనుకోని విధంగా లోపలికి పోలీసులు వచ్చారు. ఆమె పిల్లల్ని బయటకు వెళ్లవలసిందిగా కోరారు...
ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్లలో గొడవలు చోటుచేసుకోవటం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా తమిళనాడులోని థియేటర్లలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. రోహిణీ థియేటర్ వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్లు ఉన్నా కూడా కొండజాతికి చెందిన వారిని థియేటర్‌లోకి అనుమతించకపోవటాన్ని తప్పుబట్టారు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏ సర్టిఫికేట్ సినిమా ఆడుతున్న థియేటర్‌లోకి తన పిల్లలను అనుమతించకపోవటంతో ఓ మహిళ పోలీసులతో గొడవ పెట్టుకుంది.
ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఓ మహిళ ‘విడుదలై’ సినిమా చూడ్డానికి తన పిల్లలతో విరుగమ్‌బాంక్కమ్‌లోని ఐనాక్స్ థియేటర్‌కు వెళ్లింది. లోపలి సినిమా చూడ్డానికి కూర్చుని ఉంది. అయితే, ఆ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా కావటంతో పోలీసులు పిల్లల్ని బయటకు రమ్మని అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారు సినిమా చూడ్డానికి వీల్లేదని అన్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. కొద్దిసేపటి తర్వాత ఈ గొడవ తారా స్థాయికి చేరింది. అక్కడ ఉన్న వారు కూడా ఆమెకు మద్దతు పలికారు. పోలీసులతో గొడవకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ మధ్య కాలంలో సినిమా చూడ్డానికి కూడా స్వాతంత్రం లేకుండా పోయింది’’..‘‘ ఏ సర్టిఫికేట్ సినిమాను థియేటర్‌లలో వేయటం మానండి’’..‘‘ ఆ మహిళ గొడవ పెట్టుకోవటంలో ఎలాంటి తప్పు లేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, తన పిల్లలను థియేటర్‌లోకి అనుమతించకపోవటంతో ఆ మహిళ పోలీసులతో గొడవపడ్డం సమంజసమే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ViduthalaiPart1 – Public vs. Theater#Viduthalai #VetriMaaran pic.twitter.com/ttr4lnctXo
— VCD (@VCDtweets) April 1, 2023