Bandi Saroj Kumar: మీడియా డిబేట్‌లో హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లిల గొడవకు సంబంధించి హీరో విశ్వక్ సేన్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా, ఓ యువ దర్శకుడు ఈ వివాదంపై స్పందించారు. ఇన్‌డైరెక్ట్‌గా విశ్వక్‌కు తన మద్దతును తెలియజేశారు. నిర్భంధం, నిర్భంధం 2 చిత్రాల డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ బుధవారం ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ వాడు మంచోడు కాబట్టి F…K తో సరిపెట్టాడు. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని. నా దృష్టిలో జెండర్ కార్డు అనేది జాతి, కులం, మతం కార్డులకి ఏమాత్రం అతీతం కాదు. హ్యూమన్ ఫస్ట్ ’’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా యాంకర్ దేవీపై ఫైర్ అయ్యారు.
కాగా, విశ్వక్ సేన్‌కు హాస్య నటుడు రాహుల్ రామక్రిష్ణ మద్ధతుగా నిలిచారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ విశ్వక్ సేన్ లాంటి మంచి వ్యక్తిని అవమానపరుస్తూ నడుస్తున్న సర్కస్‌లో నేను కూడా భాగం కావాలనుకుంటున్నాను. అతడికి నా పూర్తి మద్దతు ఉంది. ముఖ్యంగా ఆ ఛానల్ అతడిని ఎలా ట్రీట్ చేసిందన్నదాంట్లో’’ అని పేర్కొన్నారు. మరి, బండి సరోజ్ కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rahul Ramakrishna: విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్ రామక్రిష్ణ