ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే ఘటనలే. అయితే ఇలా ప్రేమించుకుని బ్రేకప్ లు చెప్పుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎంతో మంది సినీతారలు..బ్రేకప్ లు చెప్పారు. తాజాగా ఓ యువ నటి.. తన లవ్ బ్రేకప్ గురించి చెప్తు.. మాజీ ప్రియుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే ఘటనలే. అయితే ఇలా ప్రేమించుకుని బ్రేకప్ లు చెప్పుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. అయితే కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలే ప్రపంచానికి తెలుస్తాయి. అలానే సినీతారల్లో బ్రేకప్ లు అనే కాస్తా ఎక్కువగానే ఉంటాయి. నయనతార, త్రిష, దీపిక పదుకొనే, కత్రినా కైఫ్, హన్సిక, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీనటులు బ్రేకప్ లు ఎదుర్కొన్నవారే. వారి కోవాకే చెందుతుంది యువ నటి దర్శ గుప్తా. అయితే తన లవ్ బ్రేకప్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యువ నటి దర్శగుప్త తనదైన నటతో ప్రేక్షకులను మెప్పించింది. తొలుత బుల్లితెరపై ఈ అమ్మడు మెరిసింది. ఆ తరువాత ‘కుక్ విత్ కోమాలి’ అనే షో తో మంచి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సినిమా అవకాశాలు వచ్చి వెండి తెరకు పరిచయమైంది. అలానే రుద్ర తాండవం, ఓ మై గోస్ట్ అనే తమిళ సినిమాలో నటించింది. ప్రస్తుతం ‘మెడికల్ మిరాకల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరో వైపు కొత్త అవకాశాల కోసం సోషల్ మీడియాను వేదికగా మార్చుకోంది. అందాల ఆరబోతలో తగ్గేదే లేదు అన్నట్లు ఈ భామ రచ్చ రచ్చ చేస్తుంది.
అందాలను చూపించడంలో తన తర్వాతే ఎవరైన అన్నట్లుగా తన హాట్ ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఈ అమ్మడు.. తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఈక్రమంలో తనకు లవ్ బ్రేకప్ జరిగిందని, అయితే తాను బ్రేకప్ చెప్పిన ప్రేమికుడు ఇప్పటికీ తననే కావాలని వేడుకుంటూనే ఉన్నాడని ఈ అమ్మడు తెలిపింద
ప్రేమికుల మధ్య నమ్మకమే పునాదని, అది ఒక్కసారి పోతే ఇక అంతేనని ఆమె పేర్కొంది. అతడు కోటేశ్వరుడైనా తనకు అవసరం లేదని, పేదవాడైనా పర్వాలేదని నిజాయితీగా ఉండేవాడే నాకు కావాలని నటి దర్శాగుప్త తెలిపారు. మొత్త మీద మరో ప్రియుడి కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పింది. మరి.. ఈ యంగ్ బ్యూటీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.