Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విష్నేష్ శివన్‌లు తమిళ సినీ పరిశ్రమలో డ్రీమ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, తిరుమలలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జంట ‘‘గలాట్టా క్రౌన్ 2022’’ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నయనతార ‘‘ ది ఎంప్రెస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా’’ అవార్డును సొంతం చేసుకున్నారు. అనంతరం గలాట్టా యూట్యూబ్ ఛానల్స్ యాంకర్ వీజే పార్వతి, నయనతారతో ఓ ఫొటో దిగారు. ఆ ఫోటోను పార్వతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నయన్ కంటే నువ్వే అందంగా ఉన్నట్లు అనిపిస్తోంది పారు’’.. ‘‘పారు.. నయన్ కంటే నువ్వే అందంగా ఉన్నావు’’.. ‘‘అక్కా! పో అక్కా! నయనతార కంటే నువ్వే అందంగా ఉన్నావు’’.. ‘‘నువ్వు నయనతారకంటే అందంగా ఉన్నావు. నీకు సిల్వర్ స్క్రీన్ లేడీ సూపర్ స్టార్‌గా పేరు పెట్టాల్సింది’’… ‘‘ పారు! నయనతారకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రతీ కామెంట్‌పై పారు స్పందించారు. వాటికి తగ్గట్టుగా సమాధానం ఇచ్చారు. మీమ్స్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కాగా, నయనతార, వెంకటేష్ హీరోగా నటించిన ‘లక్ష్మీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆనతికాలంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో పనిచేశారు. జై సింహ తర్వాత తెలుగు సినిమాలు తగ్గించారు. తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘‘గాడ్‌ఫాదర్’’ సినిమాలో నటిస్తున్నారు. మరి, వీజే పార్వతిపై పొగడ్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ram Gopal Varma: రాజకీయాల్లోకి ఎంట్రీ ఎప్పుడు.. RGV రియాక్షన్ వైరల్!