2021 జులై 25న యషికా నడుపుతున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ యాక్సిడెంట్ అప్పట్లో తమిళనాట కలకలం సృష్టించింది.
ప్రముఖ తమిళ నటి యషికా ఆనంద్ 2021 జులై 25న యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు మమల్లాపుర ఏరియాలోని సులేరికాడు వద్ద బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న ఆమె స్నేహితురాలు వల్లిచెట్టి భవాన్ని చనిపోయింది. భవాని సీటు బెల్టు పెట్టుకోకపోవటం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. యషికాతో పాటు మరో ఇద్దరు మగ స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురినీ దగ్గరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం అవ్వటంతో యషికా ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
ఈ యాక్సిడెంట్ అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, ఈ కారు యాక్సిడెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో యషికా కారు నడుపుతున్న కారణంగా ఆమెను ప్రత్యేకంగా విచారించారు. ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్ట్ చేశారు. తాను అతి వేగంగా కారు నడిపానని.. ఈ నేపథ్యంలోనే కారు అదుపు తప్పి ప్రమాదం జరిగిందని ఆమె చెప్పింది. ఈ కేసుకు సంబంధించి చెంగల్పట్టు కోర్టులో ఇంకా విచారణ నడుస్తూ ఉంది.
తాజాగా, జరిగిన విచారణ కోసం యషికా చెంగల్పట్టు కోర్టుకు వెళ్లారు. యషికాను ప్రశ్నించిన కోర్టు విచారణను జులై 27కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఆమె కోర్టు దగ్గర ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నటి యషిక ‘కవలై వేండాం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలు చేస్తున్నారు. తమిళ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, వైరల్‌గా మారిన నటి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Watch | மாமல்லபுரம் அடுத்த சூளேரிக்காடு பகுதியில், கார் விபத்து ஏற்படுத்திய வழக்கில், விசாரணைக்காக செங்கல்பட்டு நீதிமன்றத்தில் நடிகை யாஷிகா ஆனந்த் ஆஜர்! #SunNews | #YashikaaAnand | #CarAccidentCase pic.twitter.com/m2g6avOdLB
— Sun News (@sunnewstamil) April 25, 2023