దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కోలార్ గోల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. 2018లో కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కన్నడలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తొలి భాగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో సెకండ్ పార్ట్ కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. తాజాగా హీరో యశ్ తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు. అనంతరం మీడియావారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.
ఈ క్రమంలో బాహుబలి-2 సినిమా కలెక్షన్లను కేజీఎఫ్-2 మూవీ బీట్ చేస్తుందా..? అని యశ్ ని అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన యశ్.. “అలా జరిగితే మంచిదే కదా. ఓ సినిమా కలెక్షన్స్ ని మరో సినిమా బీట్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. ఇండస్ట్రీలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది” అన్నాడు. మరి బీస్ట్ సినిమా పై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగితే.. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం అంటూ జవాబిచ్చాడు. ప్రస్తుతం యశ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి కేజీఎఫ్ 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.